LOADING...
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ షేర్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి మంగళవారం విదేశీ మదుపర్లు సుమారు 107 కోట్ల రూపాయల షేర్లను విక్రయించారు. వేరే దేశాల్లో, ముఖ్యంగా వెనెజువెలా, ఇరాన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడం వల్ల గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలోనే ఉన్నాయి. ఈ పరిణామం దేశీయ సూచీలను కూడా ప్రభావితం చేస్తోంది. ఫలితంగా, సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టంలో కొనసాగుతున్నాయి. గత సెషన్ ముగింపు (85,063 పాయింట్లు)తో పోలిస్తే, బుధవారం ఉదయం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది, అయితే కొంత సమయం తరువాత కొంత కోలుకోగలిగింది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.92 గా నమోదు 

అయినప్పటికీ, చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 85,000 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఉదయం 10:30 గంటలకు ఇది 84,889 పాయింట్ల వద్ద, 175 పాయింట్ల నష్టంతో కదలికలో ఉంది. మరోవైపు, నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతూ 26,131 పాయింట్ల వద్ద, 47 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్‌లో టాటా టెక్,కేపీఐటీ టెక్నాలజీస్,టైటాన్,టాటా ఎలాక్సీ, లూపిన్ షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే ఇండియన్ హోటల్స్, సిప్లా, టీఎమ్‌పీవీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నైకా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 189 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది, అయితే బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో ఉంది. విదేశీ మారకంలో, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.92 గా ఉంది.

Advertisement