Delhi Tragedy: నలుగురు దివ్యాంగ కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య
దిల్లీ నగరంలోని రంగపురి ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హీరాలాల్ అనే వ్యక్తి తన నలుగురు దివ్యాంగ కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 50 ఏళ్ల హీరాలాల్, తన భార్య మరణంతో నలుగురు దివ్యాంగ కుమార్తెల సంరక్షణ బాధ్యతను ఒంటరిగా భరించలేక ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరాలాల్ నివసించే ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లగా, హీరాలాల్ తో పాటు, ఆయన నలుగురు కుమార్తెల మృతదేహాలు కనిపించాయి.
విష ద్రావణం తాగి ఆత్మహత్య
సల్ఫాస్ వంటి విష ద్రవణాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో హీరాలాల్ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. భార్య మరణంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన, దివ్యాంగ కూతుళ్లను చూసుకోవడం కష్టంగాతరంగా మారంది. నీతు (18), నిషి (15), నీరూ (10), నిధి (8)ని మృతులుగా గుర్తించారు.