LOADING...
Kannada actor Dhanush: "నా భార్య కొడుతోంది".. పోలీసులకు కన్నడ నటుడు ధనుష్ ఫిర్యాదు !!
'నా భార్య కొడుతోంది'.. పోలీసులకు కన్నడ నటుడు ధనుష్ ఫిర్యాదు !!

Kannada actor Dhanush: "నా భార్య కొడుతోంది".. పోలీసులకు కన్నడ నటుడు ధనుష్ ఫిర్యాదు !!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ సినీ నటుడు ధనుష్ రాజ్, తన భార్య అర్షితపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ధనుష్ రాజ్ ఫిర్యాదులో, తనను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు , ప్రాణహానీ బెదిరింపులకు కూడా పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.

వివరాలు 

విదేశాలకు వెళ్లిన విషయంలో గొడవ..

ధనుష్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, అర్షిత తనను తెలియచేయకుండా విదేశాలకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించగా, ఆమె తీవ్రమైన ఆగ్రహంతో తనపై దాడి చేశారని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటన తరువాత వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయని ఆయన అన్నారు. ఫిర్యాదులో మరో కీలక అంశం ఏమిటంటే, భార్య తనను కొట్టేందుకు గుండాలను పంపిస్తానని, అవసరమైతే చంపేస్తానని బెదిరించిందని ధనుష్ రాజ్ వెల్లడించారు. ఈ కారణంగా తనకు ప్రాణహానీ ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాలు 

తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నమా?

ధనుష్ రాజ్ ఆరోపణల ప్రకారం, అర్షిత తాను బాత్రూమ్‌లో ఉన్నప్పుడు గాజుకు చేతి గాయం చేయడం, ఆ తర్వాత తాను ఆమెపై దాడి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం, తనపై కేసులు పెట్టేందుకు ఆత్మహత్యను ప్రయత్నిస్తానని బెదిరించడం వంటివి చేస్తోంది. ఈ వరుస ఘటనలతో ధనుష్ రాజ్ చాలా రోజులుగా మానసిక, శారీరకంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ధనుష్ రాజ్ ఫిర్యాదు అందినట్లు గిరినగర్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఇరు వర్గాల వాదనలను పరిశీలించిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ కేసు సంబంధిత పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement