LOADING...
Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు
వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు

Mumbai: వినాయక నిమజ్జన సమయంలో ముంబైకి బాంబు బెదిరింపులు.. నిందితుడు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి.వినాయక నిమజ్జన సమయంలో వచ్చిన బెదిరింపు మెయిల్‌ ముంబై పోలీస్‌ సిబ్బందిని హై అలర్ట్‌లోకి మార్చింది. ఈమెయిల్‌లో ముంబైలో 34 మానవ బాంబులు మోహరించబడ్డాయని, 400కిలోల ఆర్డీఎక్స్‌తో కోటిమందిని చంపే ప్రయత్నం జరుగుతుందని బెదిరింపునిచ్చారు. రాష్ట్రంలోని భద్రతా యంత్రాంగం పూర్తిగా కట్టుదిట్టం చేశారు. దర్యాప్తు క్రమంలో నిందితుడిగా బీహార్‌కు చెందిన అశ్వినీ కుమార్‌ను గుర్తించి నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. అతను తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఈ నకిలీ బెదిరింపులు చేపట్టినట్లు గుర్తించారు. 2023లో ఫిరోజ్ అనే వ్యక్తి తనపై కేసు పెట్టి మూడు నెలల జైలు శిక్ష అనుభవించడంతో కోపంతో ఈ చర్య చేశానని అశ్వినీ పోలీసులకు వివరించాడు.

Details

పలు చోట్ల ముమ్మరంగా తనిఖీలు

పోలీసుల తనిఖీలలో నిందితుడి వద్ద ఏడు మొబైల్‌ ఫోన్స్‌, మూడు సిమ్‌ కార్డులు, ఆరు మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికార వాట్సాప్‌ నంబర్‌కు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లో, వారు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే జీహాద్‌ గ్రూప్‌కు చెందిన వారన్నారు. 14 మంది ఉగ్రవాదులు నగరంలో ప్రవేశించారని, చతుర్దశి సందర్భంగా 34 ప్రాంతాల్లో మానవ బాంబులు మోహరించబడ్డాయని, ఆర్డీఎక్స్‌ 400 కిలోలతో కోటిమందిని చంపే ప్రయత్నం జరుగుతుందని హెచ్చరించారు. క్రైమ్‌ బ్రాంచ్‌, యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌ తదితర దర్యాప్తు సంఘాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముంబైలో పలుచోట్ల తనిఖీలు, సాంకేతిక పర్యవేక్షణలు నిర్వహించిన తరువాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.