LOADING...
Raj Kundra: రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్‌ కుంద్రాకు సమన్లు
రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్‌ కుంద్రాకు సమన్లు

Raj Kundra: రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్‌ కుంద్రాకు సమన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టీ,రాజ్ కుంద్రా దంపతులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముంబై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేశారు. సెప్టెంబర్ 15న జరిగే విచారణకు రాజ్ కుంద్రా హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అదే సమయంలో,నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆడిటర్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి.

వివరాలు 

జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

శిల్పా శెట్టీ, రాజ్ కుంద్రా పై రూ.60 కోట్ల పెట్టుబడి ఒప్పందం ద్వారా మోసం చేశారని దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేసి జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, శిల్పా, రాజ్ కుంద్రా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే నేపధ్యంలో అధికారులు తాజాగా వారికి లుకౌట్ నోల్‌కి జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్‌ కుంద్రాకు సమన్లు