
Mumbai metro: మునిగిన కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్.. రైలు నుంచి దిగని ప్రయాణీకులు.. చివరికి..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
సాధారణంగా వర్షాలు జూన్ మొదటి వారంలో మొదలవుతాయి.అయితే,ఈసారి వేసవిలోని అగ్నికర్తెల కాలంలోనే భారీ వర్షాలు మొదలయ్యాయి.
గత నాలుగు రోజులుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ముంబయిలో కుండపోత వర్షాల కారణంగా తాజాగా ప్రారంభించిన వర్లీ భూగర్భ మెట్రో స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనూహ్యంగా వేగంగా దేశంలోకి ప్రవేశించాయి.
వాస్తవానికి ఈ రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశముందని అంచనా వేసినప్పటికీ, వారం ముందే దేశంలోకి వచ్చేశాయి.
వివరాలు
అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో భారీగా నీరు
ఈ ప్రభావంతో పశ్చిమ తీరాన ధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంది.
భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తీవ్ర ప్రభావం కనిపించింది.
ఇటీవల ప్రారంభించిన వర్లీ అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో భారీగా నీరు చేరింది.
వర్షపు నీటి వల్ల ఆ స్టేషన్ చెరువును దాల్చింది.ఈ స్థితిని చూసిన ప్రయాణికులు మెట్రో రైలు దిగేందుకు భయపడిపోయారు.
స్టేషన్ లోపలి ప్లాట్‌ఫారాలపైనికి కూడా నీరు చేరింది. మెట్రో రైలు ఆగినప్పుడు దానిపై ఎక్కడ ప్లాట్‌ఫామ్ ఉందో గుర్తించలేక ప్రయాణికులు దిగేందుకు వెనుకంజ వేశారు.
రైలు ఆగిన చోట ప్రయాణికులు దిగేందుకు ఇష్టపడకపోవడంతో దీంతో ఆ రైలు అలాగే వెళ్లిపోయింది.
వివరాలు
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం
ఆ సమయంలో ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియోలుగా చిత్రీకరించారు. అంతేకాదు, మెట్రో పైకప్పు నుండి నీరు కారుతూనే ఉంది.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది.
దీని ప్రభావంగా ముంబయి నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
తడిసిన స్టేషన్‌లో దైర్యంగా దిగిన కొందరు ప్రయాణికులు నీటిలో నడుచుకుంటూ బయటకు వెళ్లడం వంటి దృశ్యాలు కనిపించాయి.
ఈ సందర్భంలో మెట్రో పైకప్పు నుంచి నీరు లీకవుతున్న దృశ్యం స్పష్టంగా రికార్డ్ అయ్యింది.
వరదలకు కారణం సరైన డ్రైనేజీ లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
వివరాలు
ప్రభావితమైన విమాన సర్వీసులు, రైల్వే రాకపోకలు
ముంబయి మెట్రో లైన్-3 సేవలు మే 10న ప్రారంభించారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుండి వర్లీకి ఉన్న ఆచార్య ఆత్రే చౌక్ వరకు ఈ లైన్ విస్తరించి ఉంది.
కొత్తగా ప్రారంభించిన స్టేషన్‌లో ఇంత నీరు చేరిన నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత 35 సంవత్సరాల్లో ఈ స్థాయిలో వర్షం ఇదే తొలిసారి కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వచ్చే వారం రోజుల్లో కూడా పశ్చిమ తీర రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
ముంబయిలో వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులు, రైల్వే రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మునిగిన కొత్తగా ప్రారంభించిన మెట్రో స్టేషన్
🚨 Newly inaugurated Mumbai Metro's line 3 was flooded after rainwater entered the station. pic.twitter.com/wLWZt5N0FE
— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2025