LOADING...
Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం
ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో ఘోరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ క్రౌడ్‌ కారణంగా ట్రైన్‌ నుంచి పలువురు ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోవడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (CST) నుంచి థానే జిల్లాలోని కేసర ప్రాంతానికి వెళ్లుతున్న రైల్లో ఈ ప్రమాదం జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం, ట్రైన్‌లో భారీగా ప్రయాణికులు ఉండటంతో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రయాణికులు క్రిక్కిరిసి నిలబడి ఉండటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో డోర్ల వద్ద వేలాడుతూ ఉన్న ప్రయాణికులు అదుపుతప్పి రైలు నుంచి కింద పడిపోయారు.

Details

చనిపోయిన వారిలో కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం

మొత్తం 12 మంది ట్రాక్‌పై పడిపోయారని, అందులో ఐదుగురు దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఓవర్ క్రౌడింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అర్థమవుతోంది. మరణించిన ఐదుగురిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో ముంబైలో రైల్వే భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవెత్తుతున్నాయి.