
Delivery Agent Urinates: లిఫ్ట్‌లో మూత్రవిసర్జన చేసిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న నివాసితులు!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని విరార్ వెస్ట్ ప్రాంతంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఇ-కామర్స్ డెలివరీ సంస్థ 'బ్లింకిట్'కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్, బిల్డింగ్‌లోని లిఫ్ట్‌లో మూత్రవిసర్జన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటనపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇది విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ బిల్డింగ్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో అసహజమైన దుర్వాసన రావడంతో నివాసితులు అనుమానంతో సీసీటీవీ ఫుటేజీను పరిశీలించారు. అందులో బ్లింకిట్ జాకెట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో పార్సిల్‌తో లిఫ్ట్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతరం అతను తన ప్యాంట్ జిప్ విప్పి, కెమెరాకు కనిపించకుండా ఉండేందుకు ఓ మూలకు జారి, అక్కడే లిఫ్ట్ వాకిళ్లపై మూత్ర విసర్జన చేశాడు.
Details
డెలవరీ ఏజెంట్ పై దాడి చేసిన సిబ్బంది
వెంటనే బ్లింకిట్ కార్యాలయాన్ని సంప్రదించి, సంబంధిత డెలివరీ ఏజెంట్‌ను గుర్తించారు. తర్వాత ఆగ్రహించిన రెసిడెంట్స్ అతడిపై దాడి చేసినట్టు సమాచారం. ఈసందర్భంగా అతడిని విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అసభ్య ప్రవర్తన కంపెనీల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఈ వ్యవహారంపై బ్లింకిట్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కంపెనీ ఎలా స్పందిస్తుందో, బాధ్యత ఎలా స్వీకరిస్తుందో అనే అంశంపై కూడా జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సంఘటన వలన డెలివరీ రంగంలోని వ్యవరిత శైలిపై మరోసారి చర్చ మొదలైంది.