
Natasa Stankovic: ముంబైలో నటాషా స్టాంకోవిచ్.. బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్‌తో చక్కర్లు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిక్, ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే.
దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలో గడిపిన ఆమె, ఇప్పుడు ముంబయికి వచ్చారు.
ఆమెతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉన్నారు.
వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైట్ జాకెట్ వేసుకున్న నటాషా ఒక జిమ్ ముందు ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చి, ఆ తర్వాత స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయారు.
వివరాలు
సెర్బియాలో కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్
హార్దిక్ నుంచి విడిపోయిన తర్వాత నటాషా సెర్బియాలోకి వెళ్లారు. అక్కడ, ఆమె కుమారుడు అగస్త్య నాలుగో పుట్టినరోజు (జులై 30) కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఘనంగా జరుపుకున్నారు.
ఆ సంబరాల ఫొటోలు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఆ తర్వాత, ఆమె తన జీవితాన్ని గురించి అప్‌డేట్స్ ఇవ్వడం కొనసాగిస్తూ, జీవిత పాఠాల గురించి కొన్ని కొటేషన్లు షేర్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అలెగ్జాండర్ తో మరోసారి కెమెరాకి చిక్కిన నటాషా..!
హార్దిక్ పాండ్యా నుండి విడాకుల తర్వాత అలెగ్జాండర్ తో మరోసారి కెమెరాకి చిక్కిన నటాషా..!#NatasaStankovic #AleksandarAlex #HardikPandya #ViralVideo #Mumbai #Oneindiatelugu pic.twitter.com/ZrtBkj0fv4
— oneindiatelugu (@oneindiatelugu) September 11, 2024