
Navi Mumbai: మూడేళ్లుగా ఫ్లాట్‌లో బందీ.. స్వీయ నిర్బంధం విధించుకున్న టెకీ!
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిదండ్రులు,సోదరుడి మృతితో కలిగిన మానసిక దుఃఖం ఒక టెకీ జీవితాన్ని తీవ్ర నిరాశ, నిస్సహాయత వైపు నడిపింది. నవీ ముంబైకి చెందిన 55 ఏళ్ల అనూప్‌కుమార్ నాయర్ అనే మాజీ కంప్యూటర్ ప్రోగ్రామర్ గత మూడేళ్లుగా తన ఫ్లాట్ నుంచే బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్నాడు. సెక్టార్-24, జూనాగర్ ప్రాంతంలోని ఘార్కూల్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న అతడిని అదే అపార్ట్‌మెంట్‌లోని ఇతర నివాసితులు 'సీల్' అనే ఎన్జీవో సంస్థ కార్యకర్తలు గుర్తించి రక్షించారు.
వివరాలు
ఆహారం కోసం ఫుడ్ డెలివరీ యాప్‌పై ఆధారం
అనంతరం అతడిని పన్వేల్‌లోని సీల్ ఆశ్రమానికి తరలించి, అక్కడ మానసిక వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. అతడి ఫ్లాట్‌కి అడుగుపెట్టినవారికి అక్కడి దృశ్యం అత్యంత వేదనాత్మకంగా కనిపించిందని, పూర్తి చెత్తతో నిండిపోయి ఉండటంతో అక్కడ అతడు ఏ పరిస్థితుల్లో జీవించాడో స్పష్టంగా అర్థమైందని సీల్ కార్యకర్తలు తెలిపారు. ఆహారం కోసం అతడు ఫుడ్ డెలివరీ యాప్‌ల మీద ఆధారపడి ఉండేవాడని ఎన్జీవో పేర్కొంది.