Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
అండర్‌వర్డ్ డాన్ చోటా రాజన్ అనారోగ్యానికి గురయ్యాడు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న రాజన్ శుక్రవారం(జనవరి 10)అనారోగ్యానికి గురి కావడంతో జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. .
అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ వైద్యులు ఆరోగ్య బులెటిన్ విడుదల చేసిన తర్వాతే పూర్తి సమాచారం తెలియవచ్చు.
చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. అండర్‌వర్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం రైట్ హ్యాండ్‌గా పేరు గాంచిన చోటా రాజన్ అనేక కేసుల్లో దోషిగా తేలడంతో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
కొన్ని సంవత్సరాలు దావూద్ ఇబ్రాహీం అనుచరుడిగా ముంబై మాఫియాను నడిపించాడు.
వివరాలు
గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయశెట్టి హత్య
2001 మే 4న సెంట్రల్ ముంబైలోని గామ్ దేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయశెట్టిని అతని హోటల్‌లోనే హత్య చేశారు.
ఈ హత్య ముంబైలో పెద్ద సంచలనం సృష్టించింది. నేరం నిర్ధారితమైన తరువాత ముంబై ప్రత్యేక న్యాయస్థానం చోటా రాజన్‌కు యావజీవ కారాగార శిక్షను విధించింది.
2018లో సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ జే డే హత్య కేసులో కూడా ప్రత్యేక కోర్టు రాజన్‌కు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులతో పాటు మరిన్ని కేసుల్లోనూ అతనికి దోషం నిర్ధారించబడటంతో అతడు ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.