
Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీ, విదేశీ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కారు డ్రైవర్లు,ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ తలెత్తింది. రోడ్డుపైనే ఒకరినొకరు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు నిలిపే విషయంపై క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, కొందరి వాహన డ్రైవర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరగడంతో అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒకరిని ఒకరు కాలర్ పట్టుకుని రోడ్డుపై పడేసి గుద్దుకున్నారు. ఈ హడావుడితో విమానాశ్రయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాలు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
ఘర్షణ మరింత తీవ్రతరం అవుతుండటంతో అక్కడ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వారు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటన వల్ల ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు కొద్దిసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కారు డ్రైవర్లు,ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ
Freestyle WWF at Mumbai Airport between Drivers and airport staff. pic.twitter.com/wWuTuYIAOm
— Singh Varun (@singhvarun) June 4, 2025