Page Loader
Harsh Goenka: లాల్‌బాగ్చా వద్ద వీఐపీ కల్చర్ పై హర్ష్‌ గొయెంకా ట్వీట్‌.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
లాల్‌బాగ్చా వద్ద వీఐపీ కల్చర్ పై హర్ష్‌ గొయెంకా ట్వీట్‌

Harsh Goenka: లాల్‌బాగ్చా వద్ద వీఐపీ కల్చర్ పై హర్ష్‌ గొయెంకా ట్వీట్‌.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో ప్రసిద్ధి చెందిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణపతిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరవుతుంటారు. అయితే, ఈ ఉత్సవంలో వీఐపీ సంస్కృతి అమలుచేయడంపై పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గొయెంకా స్పందించారు.

వివరాలు 

విశ్వాసం అనేది అందరికీ సమానం కాదా ?: హర్ష్‌ గొయెంకా

"లాల్‌బాగ్చా వద్ద వీఐపీ సంస్కృతిని ఎందుకు అమలు చేస్తున్నారు? ఈ సంస్కృతి వల్ల సామాన్యులందరూ రద్దీని ఎదుర్కొంటున్నారు. దర్శనం కోసం గణనీయంగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఇది అసమానతలను ప్రతిబింబిస్తోంది. విశ్వాసం అనేది అందరికీ సమానం కాదా ?" అని గొయెంకా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన తన అధికారిక 'ఎక్స్‌' ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో, లాల్‌బాగ్చా వద్ద గణపతిని దర్శించేందుకు పెద్దఎత్తున భక్తులు రావడం, భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాలు మాత్రమే గేట్లను తెరవడంతో భక్తులు పరుగులు పెట్టడం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాలు 

దర్శనానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు 

"గంటలకొద్దీ క్యూలో నిలబడి క్షణం కూడా దర్శించుకోవడం కుదరడం లేదు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. దీనికి పరిష్కారం ఉందా?" అని ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. "దర్శనం కేవలం వీఐపీలకే అని ప్రకటించాల్సిందే" అని మరో నెటిజన్‌ రాసారు. లాల్‌బాగ్చా వద్ద గణపతి దర్శనానికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భక్తులను అక్కడి భద్రతా సిబ్బంది తోసివేస్తున్న వీడియోలు, అదే సమయంలో వీఐపీ కుటుంబాలను నేరుగా గణపతిని దర్శించుకుని, విగ్రహం ముందు కూర్చొని ఫొటోలు తీసుకోవడానికి అనుమతిస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్ష్‌ గొయెంకా చేసిన ట్వీట్‌