LOADING...
Mumbai: ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం
ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం

Mumbai: ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలు అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఇదే తరహా పరిస్థితి తాజాగా ముంబైలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్యను దృష్టిలో ఉంచుకొని నిపుణులు పరిష్కార చర్యలు చేపట్టుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలియజేశారు.

వివరాలు 

ప్రయాణికులు ముందే సమాచారాన్ని చెక్ చేయాలని సూచన

ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 400 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయని Flightradar24 డేటా తెలిపింది. ఎఎన్ఐతో మాట్లాడిన కెప్టెన్ శరత్ పనిక్కర్ మాట్లాడుతూ, "ప్రతి విమానం బయలుదేరే ముందు పంపాల్సిన ఫ్లైట్ ప్లాన్‌ను కంప్యూటర్ ఆటోమేటిక్‌గా రిజిస్టర్ చేస్తుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ పనిచేయకపోవడంతో, వాటిని మాన్యువల్‌గా నమోదు చేయాలి. దీనివల్ల ఆలస్యం జరిగింది" అని చెప్పారు.

వివరాలు 

వాతావరణ సమాచారాన్ని కూడా మాన్యువల్ గా నమోదు  

దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల నుంచి వచ్చే డేటా ATIS (Automatic Terminal Information System) ద్వారా ఆటోమేటిక్‌గా కంట్రోల్ రూమ్‌కి చేరుతుంటుంది. ఇప్పుడు అది కూడా చేతితో నమోదు చేయాల్సి ఉండడం వల్ల ప్రక్రియ మరింత నెమ్మదించింది. "విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత పెద్దగా సమస్య ఉండదు. కానీ గాల్లోకి పంపే ప్రక్రియలో సమయం ఎక్కువ పడుతుంది" అని ఆయన వివరించారు.

వివరాలు 

లోపానికి నిజమైన కారణం ఏమిటో దర్యాప్తు

సిస్టమ్ ఎందుకు పనిచేయలేదన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. మాల్వేర్ దాడి వల్ల ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఓవర్‌లోడ్ జరిగిందేమో అన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సిస్టమ్ ఇంటర్‌ఫేస్‌లు,రాడార్ సింక్రనైజేషన్ మాడ్యూళ్లు దర్యాప్తులో ఉన్నాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా ITA ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ విమాన సంస్థల సేవలూ ప్రభావితమయ్యాయి. రోమ్‌కు వెళ్లే విమానం దాదాపు రెండుగంటలు, లండన్‌కు వెళ్లే విమానం గంటకు పైగా ఆలస్యం అయినట్లు సమాచారం.