
Mumbai Monorail train: ముంబైలో వర్ష బీభత్సం.. ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలులో 200 మందికిపైగా ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై మహా నగరంలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనోరైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయం కారణంగా సాయంత్రం 6:15 గంటల సమయంలో మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య రైలు దాదాపు గంటా పైగా ఆగిపోయింది. ఆ సమయంలో దాదాపు 200 మంది ప్రయాణికులు రైలులో చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగానే రైలు ఆగిపోయినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) తెలిపింది.
వివరాలు
భారీ వర్షాల కారణంగా ముంబయిలో స్తంభించిన జనజీవనం
తమ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణికులు బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి సహాయం కోరారు. వెంటనే ముంబై అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరి ప్రయాణికులకు సహాయక చర్యలు అందించింది. గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా ముంబయిలో సాధారణ జనజీవనం స్తంభించింది.