LOADING...
Mumbai: ముంబై విరార్ సిటీలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి
ముంబై విరార్ సిటీలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి

Mumbai: ముంబై విరార్ సిటీలో కుప్పకూలిన భవనం.. 18 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది అక్కడికిక్కడే చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగస్టు 27న ఈ భవనంలో జోయల్ కుటుంబం తమ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకను నిర్వహించుకుంది. ఇంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయింది. కూలిన భాగంలో ఉన్న శిథిలాల నుండి కొంత మంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపు వారు మరణించారు.

వివరాలు 

కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు

జిల్లా విపత్తు నిర్వహణ అధికారి వివేకానంద్ కదమ్ తెలిపిన వివరాల ప్రకారం, 2012లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, వాసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించిన ప్రకారం, ఈ భవనం అనధికారంగా నిర్మించారని తెలిపారు. భవనం కూలినప్పుడు పక్కన ఉన్న ఇళ్లకు కూడా నష్టం చోటుచేసుకున్నప్పటికీ, అప్పటికి ఆ ఇళ్లలో ఎవరూ లేరు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది.

వివరాలు 

వీవీఎంసీ డెవలపర్ అరెస్ట్ 

30గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇప్పటివరకు 18 మంది మరణించారని, మరో 6 మంది శిథిలాల నుండి వెలికితీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, మరో 6 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీవీఎంసీ డెవలపర్ పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అధికారులు,శిథిలాల కింద ఇంకా కొంత మంది చిక్కి ఉండవచ్చునని,వారి కోసం కూడా సహాయక బృందాలు శోధన కొనసాగిస్తున్నాయని తెలిపారు.