LOADING...
Rohit Sharama: ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించిన రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించిన రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

Rohit Sharama: ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించిన రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వద్ద కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన ఆసుపత్రి బయట ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమైన సిరీస్‌లు దగ్గర్లో ఉండగా రోహిత్ ఆసుపత్రికి వెళ్లడంపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే రోహిత్ ఆసుపత్రికి వెళ్లిన కారణంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగమని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లు బిజీ క్రికెట్ షెడ్యూల్‌కు ముందు ఇలాంటి చెకప్‌లు చేయించుకోవడం సాధారణమే అయినప్పటికీ, చాలాకాలం తర్వాత రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈ పరిణామం అభిమానుల్లో మరింత చర్చకు దారి తీసింది

Details

రొటీన్ ఫిట్‌నెస్ టెస్ట్ కు మాత్రమే హాజరు

ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే #RohitSharma హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి చేరింది. హిట్‌మ్యాన్ ఆరోగ్యంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇది కేవలం రొటీన్ ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. చాలా నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ మళ్లీ వన్డే జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నారు. ఆయన చివరిసారిగా మార్చిలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా 'ఏ' జట్టుతో జరగనున్న అనధికారిక సిరీస్‌తో మైదానంలోకి తిరిగి రానున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న కీలక పర్యటనకు సన్నద్ధం కావడానికే రోహిత్ ఈ సిరీస్‌లో ఆడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Details

నవంబర్ లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్, నవంబర్ నెలల్లో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న పెర్త్‌లో, 23న అడిలైడ్‌లో, 25న సిడ్నీలో వన్డేలు ఆడతారు. ఈ నేపథ్యంలో రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులో ఉండటం అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.