Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మరో ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది.
ముఖ్యంగా, ముంబైకి ప్రవేశించే వాహనాలకు వర్తించే టోల్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. దీంతో, మహారాష్ట్రలోని ఇతర నగరాలు. ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లే ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలు అంటే ప్రధానంగా కార్లకు టోల్ ఫీజును మినహాయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
అయితే, బస్సులు, లారీలు,ట్రక్కులకు ఈ నిర్ణయం వర్తించదు.ముంబై నగరంలోకి ప్రవేశించేందుకు మొత్తం 5 టోల్ బూత్‌లు ఉన్నాయి.
వివరాలు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
వీటిలో, నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు ఈ నిర్ణయం వర్తించబోతోంది. ఈ నిర్ణయం ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలులోకి వస్తుంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.
ఈ రోజు లేదా రేపట్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్లు, ఇతర చిన్న వాహనదారులు స్వాగతిస్తున్నారు.
రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఇందులో, అధికార మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి మధ్య పోటీ జరుగనుంది.
ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు పైచేయి సాధించిన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజల్ని ఆకట్టుకునేందుకు చురుకుగా చర్యలు తీసుకుంటోంది.