LOADING...
Richest Ganpati: సంపన్న వినాయకుడు.. రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌తో గణేశ్ మండపం
సంపన్న వినాయకుడు.. రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌తో గణేశ్ మండపం

Richest Ganpati: సంపన్న వినాయకుడు.. రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌తో గణేశ్ మండపం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వేడుకల వాతావరణం నెలకొంది. మండపాలు అలంకరించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వివిధ ఆకృతుల వినాయక విగ్రహాలు, ఖరీదైన మూర్తులు, భారీ సెట్టింగ్‌లు భక్తులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని ఒక గణేశ్ మండపం ఈసారి ఏకంగా రూ.474.46 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబయి శివారులోని 'మతుంగా ప్రాంతంలో జీఎస్‌బీ సేవా మండల్' గత ఏడు దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది 71వ వార్షికోత్సవం జరగనుంది. దేశంలోనే సంపన్న వినాయకుడు (Richest Ganpati)గా ప్రసిద్ధి చెందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈసారి 474.46 కోట్ల రూపాయల బీమా చేయించారని నిర్వాహకులు వెల్లడించారు.

Details

బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా

దీనికి ప్రధాన కారణం, అక్కడి గణపయ్యను భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనున్నారు. గత ఏడాది ఈ మండపానికి రూ.400.58 కోట్ల బీమా కవర్ తీసుకున్నారు. ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి కలిపి రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా పొందారు. అలాగే గణపయ్యపై అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తించనుంది. గతంలో ఈ మొత్తం 2023లో రూ.38 కోట్లు, 2024లో రూ.43 కోట్లుగా ఉండేది.

Details

ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటుత

అంతేకాదు అగ్నిప్రమాదం, భూకంపం వంటి విపత్తుల ముప్పు కోసం మరో రూ.2 కోట్ల ప్రత్యేక బీమా తీసుకున్నారు. ఫర్నీచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు కూడా ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. అదనంగా పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం ఈసారి QR కోడ్ సేవలు, డిజిటల్ లైవ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.