
Afghan-Pak War: ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. 12 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి..
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో మంగళవారం రాత్రి పాకిస్తాన్ సైనికులు,ఆఫ్ఘాన్ తాలిబాన్ బలగాల మధ్య కొత్తగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పాకిస్తాన్ ఆర్మీ 23 సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. అదేవిధంగా, 200కు పైగా తాలిబాన్ యోధులు హతమయ్యారని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. ఇక కాందహార్ ప్రావిన్స్‌లోని స్పిల్ బోల్డాక్ జిల్లాలో పాకిస్తాన్ సైనికులు కొత్తగా దాడులకు పాల్పడగా, ఆ ఘర్షణల్లో 12 ఆఫ్ఘాన్ సివిల్ ప్రజలు మరణించారు. తాలిబాన్ అధికారుల ప్రకారం, 100 మందికి పైగా మంది గాయపడ్డారు. ఈ ఘటనల అనంతరం ఆఫ్ఘాన్ బలగాలు ప్రతీకార చర్యలు చేపట్టి పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఆక్రమించాయి.
వివరాలు
తాలిబాన్ దళాలు పాకిస్తాన్‌పై ప్రతీకారం
తాలిబాన్ ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, పాకిస్తాన్ సైనికులు సివిల్ పౌరులపై దాడులు నిర్వహించారని, ఆఫ్ఘాన్ బలగాల ప్రతీకారంలో అనేక పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు తెలిపారు. 12 మంది చనిపోయినట్లు ఆయన ట్వీట్ చేశారు.ప్రతీకార దాడిలో అనేక పాకిస్తాన్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరు వర్గాలు ఈ వారంలో సరిహద్దు వెంట కాల్పులు జరిపిన కారణంగా డ్యూరాండ్ లైన్ పరిధిలో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. ఇదే సమయంలో,తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నప్పటికి, పాకిస్తాన్ వైమానిక దాడులు కాబూల్ పై నిర్వహించింది. పాక్ ప్రభుత్వం తాలిబాన్ నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సంఘటనల తర్వాత తాలిబాన్ బలగాలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.