Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మవ్లావి మహ్మద్ ఖాసిం రియాజ్ తెలిపారు. గెరెష్క్ జిల్లాలో ఆదివారం ఉదయం హెరాత్ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు మోటార్ సైకిల్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత 10 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,600 మందికి పైగా మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ తెలిపింది.