LOADING...
Afghan-Pakistan conflict: 132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!
132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!

Afghan-Pakistan conflict: 132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘాన్-పాక్ మధ్య ఘర్షణలు తీవ్రతరమ్యాయి. గురువారం కాబూల్ పై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ దాడులు జరుగుతున్న సమయంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నారు. దీనికి ప్రతీకారంగా శనివారం రాత్రి నుంచి ఆఫ్ఘాన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా తీవ్ర దాడులు చేస్తున్నారు. తాలిబాన్ అధికారుల ప్రకారం ఈ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించి, 25 స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలతో పాకిస్తాన్ దాడులలో వణికిపోతున్నట్లు కనిపిస్తోంది.

Details

వివాదానికి కేంద్రంగా 'డ్యూరాండ్ లైన్' 

ఆఫ్ఘాన్-పాక్ వివాదం కొత్తది కాదు. ఈ వివాదానికి మూలకారణం 132 సంవత్సరాల చరిత్ర గల 'డ్యూరాండ్ లైన్'. సుమారు 2,640 కిలోమీటర్ల (1,640 మైళ్ళ) విస్తీర్ణంలో ఉన్న ఈ సరిహద్దు 1893లో బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఇది బ్రిటీష్ ఇండియా-ఆఫ్ఘాన్ మధ్య సరిహద్దును నిర్ణయించింది. అయితే ఈ రేఖ పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా విడగొట్టింది. ఆఫ్ఘాన్ ఇప్పటికీ 1893 డ్యూరాండ్ రేఖను పూర్తిగా అంగీకరించలేదు.

Details

 మరింత ముదిరిన వివాదం

తమ పష్టూన్ల తెగ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్నారని, అది ఆఫ్ఘాన్‌కి చెందినదని తాలిబాన్ మరియు పూర్వపు పాలకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రజలు తమను తాము పాకిస్తానీయులుగా చెప్పుకోకపోవడం, ఆ ప్రాంతంలోని "పాక్ తాలిబాన్లు" పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్ర దాడులు జరిపడం ఈ వివాదాన్ని మరింత సుదూరంగా చేసిందని చెప్పవచ్చు.

Details

భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత

డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్‌లో ఒక రేఖ మాత్రమే కాదు; ఇది దక్షిణాసియాలో అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు తమ సార్వభౌమాధికారం కింద వస్తుందని చెబుతుంది, అయితే ఆఫ్ఘాన్ దీన్ని అన్యాయంగా చెబుతోంది. తరచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘాన్-పాక్ సైనికులు గన్ ఫైటింగ్‌లోకి జడిపోతున్నారు. బలూచిస్తాన్ భూభాగాలను తిరిగి ఇవ్వాలని ఆఫ్ఘాన్ కోరుతూ, 2017లో పాక్ సరిహద్దులో కంచె నిర్మాణం ఈ వివాదాన్ని మరింత తీవ్రతకి నెట్టింది.