LOADING...
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. రషీద్‌ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన 
ఆసియా కప్ 2025.. రషీద్‌ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన

Asia Cup 2025: ఆసియా కప్ 2025.. రషీద్‌ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సారి జట్టుకు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించారు. స్పిన్‌ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ ఉన్నారు. అదనంగా అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ మహమ్మద్ నబీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ వరకు చేరి చారిత్రక విజయం సాధించింది. ఇక తాజాగా జింబాబ్వే సిరీస్‌లో ఆడిన జట్టుతో పోల్చితే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

Details

గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు

హజ్రతుల్లా జజై, జుబైద్ అకబరీలను జట్టులోంచి తప్పించగా, రహమానుల్లా గుర్బాజ్, మహమ్మద్ ఇషాక్ ఇద్దరూ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లుగా ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్ విభాగంలో నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ, ఫరీద్ మాలిక్ ఎంపిక కాగా, బ్యాటింగ్ విభాగంలో ఇబ్రాహీం జాద్రాన్, దర్వీష్ రసూలీ, సెడికుల్లా అతాల్, అజ్మతుల్లా ఒమర్జై, కరీమ్ జనత్, గుల్బదిన్ నయిబ్, షరఫుద్దీన్ అష్రఫ్ ఉన్నారు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రూప్-Bలో ఉంది. ఇందులో బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. మరోవైపు భారత్, ఒమాన్, పాకిస్తాన్, యుఏఈలు గ్రూప్-Aలో పోటీపడతాయి. రషీద్ సేన తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 9న హాంకాంగ్‌తో ఆడనుంది.

Details

ఆఫ్ఘనిస్తాన్ జట్టు (స్క్వాడ్)

రషీద్ ఖాన్ (కెప్టెన్) రహమానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రాహీం జాద్రాన్, దర్వీష్ రసూలీ, సెడికుల్లా అతాల్, అజ్మతుల్లా ఒమర్జై, కరీమ్ జనత్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్, షరఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్ (wk), నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్. రిజర్వ్ ప్లేయర్లు వాఫియుల్లా తరఖిల్, నంగేయాలియా ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్.