
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది.
ఈ ప్రకంపనలు ఉదయం 08:54:18 గంటలకు సంభవించాయి. భూప్రకంపనల కేంద్ర బిందువు 36.41 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70.94 డిగ్రీల తూర్పు రేఖాంశంలో భూమికి 140 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
ఇదే వారంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది నాలుగోసారి భూకంపం నమోదు కావడం గమనార్హం.
ఇప్పటివరకు ఈ ప్రకంపనల వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగిందన్న సమాచారం వెలుగులోకి రాలేదు.
అయితే భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. భయంతో కొందరు వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాలు
2,400 మందికి పైగా మృతి
గతంలో 2023 అక్టోబర్ 7న హెరాత్ ప్రాంతంలో వచ్చిన తీవ్రమైన భూకంపం మర్చిపోలేనిది.
ఆ విపత్తులో 2,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు.
ఆ సంఘటనను గత ఇరవై సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపిన అత్యంత ప్రమాదకరమైన భూకంపంగా గుర్తించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం
Earthquake of magnitude 4.2 jolts Afghanistan
— ANI Digital (@ani_digital) May 19, 2025
Read @ANI Story | https://t.co/J79VW1tgdy#Afghanistan #Earthquake #NCS pic.twitter.com/U4wl0Uj9ZQ