LOADING...
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు
ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్ వరుస ప్రకంపనలతో వణికిపోతోంది.ఆదివారం రాత్రి సంభవించిన భూకంప ప్రభావం ఇంకా తగ్గకముందే, మరోసారి భూమి కంపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే వరుసగా మూడు సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మొదటగా తెల్లవారుజామున 3.16 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో మరోసారి కదిలింది. ఆ తర్వాత 7.46 గంటలకు మూడోసారి 4.6 తీవ్రతతో భూకంపం నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. ఈ మూడు ప్రకంపనలు కాబూల్ రాజధాని నుండి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకున్నాయి.

వివరాలు 

ఆదివారం రాత్రి సంభవించిన భూకంపంలో 2200 మందికిపైగా మృతి 

ఇదే కాకుండా గురువారం రాత్రి కూడా రెండు సార్లు భూకంపం సంభవించింది. రాత్రి 10.26 గంటలకు 5.8 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించగా, 11.58 గంటలకు 4.1 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఈ వరుస భూకంపాల కారణంగా కలిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే, ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు లభించిన అధికారిక సమాచారం ప్రకారం, ఆ ప్రకంపనలో 2200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 3640 మంది గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ చేసిన ట్వీట్