Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు: 17మంది మృతి,11 మందికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్గనిస్తాన్‌లో ఆకస్మికంగా ఏర్పడిన భారీ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆఫ్గనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించినట్లుగా, ఈ వరదల వల్ల మొత్తం 17 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. హెరాత్ ప్రావిన్స్‌లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలోఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. డిసెంబర్ 29, 2025 సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మధ్య,ఉత్తర,దక్షిణ,పశ్చిమ ప్రాంతాల్లో నష్టాలు అత్యధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
1,800 కుటుంబాలపై వరద ప్రభావం
వరదల ప్రభావంతో పశువులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 1,800కుటుంబాలు ఈ ఆపద కారణంగా కష్టపడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను చేపట్టి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను పంపింది. దేశం చాలా కాలంగా వర్షాలు లేక కరువు సమస్యను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో, ఈ ఆకస్మిక వర్షాలు ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రమైన దారుణంగా మారింది.