India vs Afghanistan: అఫ్గాన్ అలౌట్.. టీమిండియా టార్గెట్ 173
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు అలౌట్ అయ్యింది. టీమిండియా ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. అఫ్గానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ 57పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక, టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రెండు చొప్పున, శివబ్ దూబే ఒక వికెట్ తీసుకున్నారు.