LOADING...
Afghanistan:ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ షహర్-ఎ-నవ్‌లో బాంబు పేలుడు.. 7 గురి మృతి, పలువురికి గాయాలు
7 గురి మృతి, పలువురికి గాయాలు

Afghanistan:ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ షహర్-ఎ-నవ్‌లో బాంబు పేలుడు.. 7 గురి మృతి, పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
10:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్‌లోని షహర్-ఎ-నవ్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని TOLOnews తెలిపింది. ఈ దాడి చైనా పౌరులనే లక్ష్యంగా చేసుకుని జరిగినట్టు ప్రాథమిక సమాచారం. షహర్-ఎ-నవ్‌లోని గుల్ఫరోషి వీధిలో, ఓ చైనా రెస్టారెంట్ సమీపంలో ఉన్న హోటల్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రాంతాన్ని కాబూల్‌లో అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ విదేశీ పౌరులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఘటనపై తాలిబాన్ అధికారులు ధృవీకరించినప్పటికీ, అధికారికంగా మరణాల సంఖ్యను వెల్లడించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాబూల్‌లో పేలుడు

వివరాలు 

ISIS-K ప్రమేయంపై అనుమానం

ఈ పేలుడుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ విభాగం (ISIS-K) కారణమై ఉండొచ్చని వర్గాలు TOLOnews‌కు తెలిపాయి. ఈ దాడిలో కనీసం ఆరుగురు మృతి చెందగా, అందులో ఇద్దరు చైనా పౌరులు ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడి బాధ్యతను స్వీకరించలేదు. అఫ్గాన్‌లో చైనా ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకుని ISIS-K ఈ దాడి చేసినట్టు తాలిబాన్ వర్గాలు చెబుతున్నాయి. అఫ్గాన్ భద్రతా వర్గాల ప్రకారం, చైనా పౌరులే ప్రధాన లక్ష్యమని భావిస్తున్నారు. అయితే ఎంతమంది చైనా పౌరులు ప్రభావితమయ్యారన్నది ఇంకా స్పష్టత రాలేదు. కాబూల్‌లోని ఎమర్జెన్సీ హాస్పిటల్‌కు 20 మందిని తరలించగా, అందులో ఒక చిన్నారి, నలుగురు మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

ISIS-K ప్రమేయంపై అనుమానం

గాయపడిన వారిలో ఏడుగురు ఆసుపత్రికి చేరకముందే మృతి చెందినట్టు సమాచారం. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, "ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు, గాయపడిన వారు ఉన్నారు. పూర్తి వివరాలు నిర్ధారణ తర్వాత వెల్లడిస్తాం" అని చెప్పారు.

Advertisement

వివరాలు 

హై సెక్యూరిటీ ప్రాంతంలో పేలుడు

స్థానిక కథనాల ప్రకారం, షహర్-ఎ-నవ్‌లోని చైనా రెస్టారెంట్ బయటే పేలుడు జరిగింది. ఈ ప్రాంతంలో విదేశీ పౌరులు, దౌత్య కార్యాలయాలు ఉండటంతో సాధారణంగా కఠిన భద్రత ఉంటుంది. దాడులు తగ్గినా ముప్పు కొనసాగుతోంది 2021లో అమెరికా సైన్యం వెనుదిరిగిన తర్వాత తాలిబాన్ అధికారంలోకి రావడంతో కాబూల్ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లు కొంత తగ్గాయి.అయినప్పటికీ,ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు అప్పుడప్పుడు దాడులు కొనసాగిస్తున్నాయి. 2025లో ప్రాణాంతక ఘటనలు 2025లో అఫ్గానిస్థాన్‌లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి.ఫిబ్రవరిలో కాబూల్‌లోని అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖలోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడి దాడిలో ఒకరు మృతి చెందగా,కనీసం ముగ్గురు గాయపడ్డారు.అదే వారం ఈశాన్య అఫ్గానిస్థాన్‌లోని ఓ బ్యాంక్ బయట ఆత్మాహుతి దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

భద్రతపై సవాలు 

మొత్తంగా హింస తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇస్లామిక్ స్టేట్ ఇంకా పెద్ద భద్రతా ముప్పుగానే కొనసాగుతోంది. గతంలో తాలిబాన్ అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, సాధారణ పౌరులపై ఈ సంస్థ దాడులు చేసింది. దీంతో దేశంలో పూర్తి భద్రత నెలకొందన్న అధికారుల వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement