
Pakistan Air Strikes: ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాకిస్తాన్ వైమానిక దాడి.. 30 మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
తమ దేశంలోని ఉగ్రవాదులను అణచివేయడానికి పాకిస్థాన్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ చర్యలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కైబర్ పక్తూంఖ్వా రాష్ట్రంలోని తిరాహ్ లోయను లక్ష్యంగా చేసుకుంది. రాత్రి రెండు గంటల సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం (PAF) JF-17 యుద్ధ విమానాల సాయంతో ఎనిమిది LS-6 బాంబులను ప్రయోగించింది. ఈ దాడులు పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై ప్రత్యేకంగా జరిపినవని సమాచారం వెల్లడిస్తోంది.
వివరాలు
ఐదు నుంచి 10 ఇళ్ల వరకు ధ్వంసం
ఉగ్రవాదులపై దాడులు జరిపినప్పటికీ, పాక్ ఆర్మీ దాడుల్లో పెద్దఎత్తున పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. తాజా వివరాల ప్రకారం 20 నుంచి 30 మంది వరకు సాధారణ పౌరులు మరణించారని, వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. అదనంగా ఈ దాడులతో ఘటనాస్థలంలో ఐదు నుండి పది ఇళ్ల వరకు పూర్తిగా ధ్వంసమైనట్టు, కనీసం 20 మందికి పైగా గాయపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.