Rashid Khan: అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడి.. క్షమించారని నేరమన్న రషీద్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడికి పాల్పడింది. పాక్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్‌లో సాధారణ పౌరులపై ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టిన ఈ చర్య రెండు రోజుల క్రితం 'కాల్పుల విరమణ ఒప్పందం' కుదిరింది. ఈ దాడితో పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ వైమానిక దాడిలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. వీరిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు ఉన్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రకటించింది. ఈ ఘటన కారణంగా, వచ్చే నెలలో పాక్-శ్రీలంక మధ్య జరగనున్న 'ట్రై సిరీస్' నుంచి అఫ్గాన్ జట్టు వైదొలిగింది.
Details
ప్రజలకు అండగా నిలుస్తాం
ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆప్ఘాన్ క్రికెట్ రషీద్ ఖాన్ తీవ్ర విచార వ్యక్తం చేశారు.అత్యంత విషాదకరమైన, పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకునే యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలి. పాక్‌తో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నాం. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలుస్తాం. దేశ సమగ్రత మాకు అత్యంత ముఖ్యమైన అంశమని రషీద్ ఖాన్ చెప్పారు.
Details
క్రికెట్ ఫ్యామిలీకి తీరని లోటు
మరో పేసర్ ఫజల్‌హక్ ఫరూఖీ మాట్లాడుతూ అమాయకులపై దాడి చేసి ప్రాణాలు తీసుకోవడం అత్యంత దారుణం. మా దేశవాళీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది క్షమించలేని నేరమన్నారు. మరో సీనియర్ ఆటగాడు మహ్మద్ నబీ ఈ ఘటనపై స్పందించారు. ఇది కేవలం పాక్టికా ప్రావిన్స్‌కు మాత్రమే విషాదకరం కాదు. యావత్తు అఫ్గాన్‌కు వర్తిస్తుంది. క్రికెట్ ఫ్యామిలీకి తీరనిలోటు అని చెప్పారు. అఫ్గాన్ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్ మాట్లాడుతూ పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని వార్తల్లో చూశామన్నారు. మా దేశానికి శత్రువు అయిన పాక్ వైమానిక దాడిలో క్రికెటర్లు మృతి చెందారని వినడం బాధాకరం. ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు. తప్పక శత్రువుకు శిక్ష విధిస్తారన్నారు.