Australia: సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఓపెనర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
కీలకమైన మ్యాచ్‌కు ముందు ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడటం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. గాయం కారణంగా అతను సెమీ-ఫైనల్స్‌కు దూరమయ్యాడు.
గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా షార్ట్ తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ విషయంపై స్పష్టతనిస్తూ, అతను పూర్తిగా ఫిట్‌గా లేరని వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్‌కు జోడీగా కొత్త ఓపెనర్‌ను ఎంపిక చేసే దిశగా జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది.
Details
జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఓపెనర్ గా వచ్చే అవకాశం
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగింపు సమయంలో మాథ్యూ షార్ట్ గాయపడాడు. అతను ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించినా వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు.
దీనివల్ల అతను బౌండరీలు సాధించేందుకు ప్రయత్నించాడు.
అయితే 15 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ పరిస్థితిలో, యువ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ట్రావిస్ హెడ్‌కు భాగస్వామిగా ఓపెనింగ్‌కు వచ్చే అవకాశముంది.
మరోవైపు బెంచ్‌లో ఉన్న ఆరోన్ హార్డీ కూడా ఓపెనర్‌గా అవకాశం పొందే అవకాశముంది. ఇక, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో, ఆస్ట్రేలియా నేరుగా సెమీ-ఫైనల్‌కు ప్రవేశించింది.