LOADING...
Afghanistan: భారత సరిహద్దు వరకు తరిమికొడతాం : పాక్ కు హెచ్చరించిన ఆఫ్గాన్
భారత సరిహద్దు వరకు తరిమికొడతాం : పాక్ కు హెచ్చరించిన ఆఫ్గాన్

Afghanistan: భారత సరిహద్దు వరకు తరిమికొడతాం : పాక్ కు హెచ్చరించిన ఆఫ్గాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాల్పుల విరమణకు ముందు పాక్-అఫ్గాన్‌ ఘర్షణలు తీవ్రంగా కొనసాగాయి. అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్‌ నబి ఒమారి పాక్‌ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రత్యర్థి ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా, అఫ్గాన్‌ దళాలు వారిని భారత సరిహద్దు వరకు తరిమికొడతామని హెచ్చరించారు. ఒమారి పాక్టికా ప్రావిన్స్‌పై పాక్‌ వైమానిక దాడి ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పాకిస్థాన్‌ సైనిక నాయకత్వాన్ని పరస్పర ఇష్టాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Details

కాల్పుల విరమణకు అంగీకారం

అలాగే ఇటీవల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి సానుభూతిపరుడై మాట్లాడిన వీడియోలను కూడా ప్రస్తావించారు. కొన్నిరోజులుగా అఫ్గాన్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మొదట నిర్ణయించిన 48 గంటల కాల్పుల విరమణ ముగిసిన వెంటనే పాక్‌ అఫ్గాన్‌పై మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్ల సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇక ఖతార్‌ రాజధాని దోహాలో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చల ఫలితంగా, తక్షణ కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించాయని ఖతార్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.