Page Loader
Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 
Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే

Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇండోర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో T20లో అతని అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ వంటి లెజెండ్‌ల ప్రత్యేక క్లబ్‌లో శివమ్ దూబే చేరాడు. టీ20 మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ తీసి హాఫ్ సెంచరీ చేసిన ఏడో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సందర్భాలలో వికెట్ తీసి, హాఫ్ సెంచరీ ఆటగాళ్ల జాబితో దూబే మూడోస్థానంలో ఉన్నాడు. ఈ ఘనతను యువరాజ్ మూడుసార్లు, విరాట్ రెండుసార్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ కూడా ఒక్కోసారి ఈ ఘనత సాధించారు.

దూబే

వరుసగా రెండు హాఫ్ సెంచరీలు

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శివమ్ రెండు ఓవర్లలో 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 40 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60* పరుగులు చేశాడు. రెండో టీ20లో శివమ్ మూడు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే 30 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. గత సంవత్సరం ఐర్లాండ్ పర్యటన ద్వారా మూడు సంవత్సరాల తర్వాత శివమ్ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల బంగారు పతకాన్ని గెలుచుకున్న జట్టులో దూబే సభ్యుడు.