
Taliban: తాలిబన్ కొత్త నిబంధనలు.. ముస్లిం సాంప్రదాయాలను ఉల్లంఘించేలా మహిళలు ప్రవర్తించరాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
'పవిత్రతను ప్రోత్సహించడం, చెడును నివారించడం' అనే పేరుతో ఆగస్టు 21న నిబంధనలు జారీ చేసినట్లు తాలిబన్ 'మినిస్ట్రీ ఫర్ ప్రమోటింగ్ వర్చ్యూ అండ్ ప్రీవెన్షన్ ఆఫ్ వైస్' ప్రకటించింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, మహిళలు తాము బయటకు వెళ్లే సమయంలో తమ శరీరాన్ని, ముఖాన్ని పూర్తిగా కప్పుకోవాలని చెప్పారు. వారు గట్టిగా మాట్లాడటం పూర్తిగా నిషేధించారు.
ఈ నిబంధనల పత్రాన్ని తాలిబన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించారు.
ఇందులో ఇస్లామిక్ షరియత్ చట్టాల ఆధారంగా తాలిబన్ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, మహిళల స్వరం కూడా ఒక రకమైన 'అవ్రా' అని పేర్కొంది. దీనిని అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినడానికి అనుమతినిస్తుంది.
Details
తాలిబన్
ఈ కొత్త నిబంధనల ప్రకారం, మహిళలు తగినంతగా కట్టుబడి తమ ముఖం, శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలన్నారు.
ఉద్దేశపూర్వకంగా ఎవరి ముఖం లేదా శరీరాన్ని చూడకూడదని ఆదేశాలు ఉన్నాయి. వాహనదారులు కూడా ఈ నిబంధనలను పాటించాలి.
డ్రైవర్లు తమ వాహనాల్లో సంగీతాన్ని వినిపించరాదు, ఉమ్మడి వాహనాల్లో సంబంధం లేని మహిళలను ఎక్కించరాదు.
వీటిని ఉల్లంఘించే వారిని తాలిబన్ 'ముహ్తసిబ్స్' లేదా నైతిక పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రకటించారు.