
India vs Afghanistan: రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
రెండో టీ-20లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.
6వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించి.. సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యాన్ని సాధించింది.
యశస్వి జైస్వాల్(68), శివమ్ దూబే(63*) మెరుపు ఇన్నింగ్స్‌లతో 173 పరుగుల విజయలక్ష్యాన్ని 15.4ఓవర్లలోనే భారత్ అలవోకగా చేధించింది. దీంతో టీ20లో సిరీస్ భారత్ వశమైంది.
రెండో ఇన్నింగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.
ఆ తర్వాత రెండో వికెట్‌కు కోహ్లితో జైస్వాల్ 57 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు.
కోహ్లి ఔట్ అయిన తర్వాత.. క్రీజులోకి వచ్చిన దూబేతో మరికొంత భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. 63పరుగుల వద్ద ఔటయ్యాడు. దూబే క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడాడు. చివరికి మ్యాచ్‌ను గెలిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
6వికెట్ల తేడాతో టీమిండియా విజయం
2ND T20I. India Won by 6 Wicket(s) https://t.co/YswzeUSqkf #INDvAFG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 14, 2024