Page Loader
India vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా 

India vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా 

వ్రాసిన వారు Stalin
Jan 14, 2024
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం రెండో టీ20 జరగనుంది. ఎన్నో చారిత్రాత్మక మ్యాచ్‌లకు సాక్షిగా నిలిచిన ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20 గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. రెండో మ్యా‌చ్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను కైవస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అలాగే, మొదటి మ్యాచ్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో రెండో టీ20కి సంబంధించిన పిచ్.. వాతావరణ నివేదికలను ఓసారి పరిశీలిద్దాం.

టీమిండియా

పిచ్ ఎలా ఉంటుంది?

హోల్కర్ స్టేడియంలో తయారు చేసిన ఎరుపు-నలుపు నేల పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేసే సమయంలో భారీ స్కోర్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌లు ప్రారంభ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం చూడవచ్చు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించవచ్చు. వికెట్లు తీయడానికి ఫాస్ట్ బౌలర్లు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ మైదానంలో ఎక్కువసార్లు 180-ప్లస్ రన్స్ చేయడం గమనార్హం. మంచు కూడా కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

టీమిండియా

స్టేడియంలో గణాంకాలు ఇలా..

ఈ వేదికపై 103 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఛేజింగ్ చేసిన జట్లు 64సార్లు గెలిచాయి. భారత్ ఇక్కడ ఆడిన మూడు టీ20ల్లో రెండింటిలో విజయం సాధించింది. 2017లో ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35బంతుల్లోనే శతకం బాదాడు. ఆ గేమ్‌లో భారత్ 260/5స్కోరును నమోదు చేసింది. ఈ మైదానంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ పేరిట ఉంది. అతను 2మ్యాచ్‌లలో 67సగటుతో, 165.43 స్ట్రైక్ రేట్‌తో 134పరుగులు చేశాడు. ఇది కాకుండా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇక్కడ అత్యధిక పరుగులు చేశాడు. అతను 2 మ్యాచ్‌లలో 59 సగటుతో మరియు 262.18 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు.