
Taliban Declare Victory: పాకిస్థాన్‌పై విజయం ప్రకటించిన తాలిబాన్.. ఆఫ్గాన్ లో భారీ సంబరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తమను విజేతలుగా ప్రకటించారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్ వంటి అనేక నగరాల్లో తాలిబాన్ యోధులతో సహా స్థానికులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నారు. సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్ఘన్ వార్తా సైట్ టోలో న్యూస్ వెల్లడించినట్లుగా, పాకిస్థాన్‌తో ఘర్షణలో తమ సైన్యం ప్రదర్శించిన ధైర్యం ప్రశంసనీయమని, ఆఫ్ఘనిస్థాన్ గగనతలాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామన్న విషయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్ యోధులు మరియు ఆఫ్ఘన్ సైన్యానికి మద్దతుగా యువత, స్థానికులు అనేక నగరాల్లో గుమిగూడి సంబరాలు నిర్వహిస్తున్నారు. నంగర్‌హార్ నివాసి మొహమ్మద్ నాదర్ చెప్పారు,
Details
సమస్యలకు నిలయంగా పాక్
"పాకిస్థాన్ మన భూభాగాన్ని ఉల్లంఘించకపోతే, ఆఫ్ఘనిస్థాన్ వారిపై దాడులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మేము పొరుగువారితో సరిహద్దులను పంచుకుంటున్నా, సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పాక్ సమస్యలకు నిలయంగా మారింది." ఇటీవల కాబూల్‌లో భారీ పేలుళ్లు సంభవించి కలకలం సృష్టించాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేశారని పాక్ రక్షణ విశ్లేషణ సంస్థలు వెల్లడించాయి. ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఆసక్తికరంగా, ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరిగినాయి.