Mohammad Nabi: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు స్టార్ అల్ రౌండర్ వీడ్కోలు..
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి నబీ రిటైర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయం గురించి అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ క్రిక్‌బజ్‌కి తెలిపినట్లు తెలుస్తోంది.
2009లో అఫ్గానిస్థాన్ తరఫున క్రికెట్‌లో అరంగేట్రం
''నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇప్పటికే ఈ విషయం గురించి అతడు బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. కొన్ని నెలల కిందట నాకూ ఇదే విషయం చెప్పాడు. అతడి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతాడని ఆశిస్తున్నాం,'' అని నసీబ్ తెలిపారు. 2009లో అఫ్గానిస్థాన్ తరఫున క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నబీ 165 వన్డే మ్యాచ్‌ల్లో 3,549 పరుగులు సాధించడంతో పాటు 171 వికెట్లు తీసుకున్నాడు.