Afghanistan:వంట ఇంట్లో కిటికీలను నిషేధించిన తాలిబాన్.. అంతర్జాతీయంగా తీవ్ర అభ్యంతరం
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు (Taliban) ఆక్రమించుకున్న తర్వాత, అక్కడి మహిళల హక్కులపై తీవ్రమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
తాజాగా, ఆ దేశ పాలకుల నుంచి వెలువడిన ఒక డిక్రీ అనేక ఆందోళనలకు కారణమైంది.
ఈ డిక్రీ ప్రకారం, నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటికి కనిపించకుండా వంట గదులకు కిటికీలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం నివ్వెరపరుస్తోంది.
''వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుఉంది. వారు కనిపించకుండా గోడలు కట్టాలి. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలి'' అని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జబీహుల్లా ముజాహిద్ నుంచి వెలువడిన డిక్రీ
Afghanistan: Taliban bans windows overlooking areas used by women pic.twitter.com/KlT645eQJ6
— Newsum (@Newsumindia) December 30, 2024