Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ పెళ్లి.. ఫొటోలు వైరల్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆయన తన పెళ్లి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో నిర్వహించారు. పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ వివాహం జరిగింది. అక్టోబర్ 3, గురువారం నాడు ఈ వేడుక జరిగినట్లు సమాచారం. రషీద్ పెళ్లి చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం,రషీద్ మాత్రమే కాకుండా, అతని ముగ్గురు సోదరులు కూడా ఒకేసారి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఒత్తిడి వల్ల రషీద్ పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో రషీద్ తన ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అయితే, 2024లో ఆఫ్ఘనిస్థాన్ టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరడం విశేషం.
వివాహానికి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో హాజరు
రషీద్ ఖాన్ వివాహానికి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులోని సన్నిహిత క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, రహమత్ షా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వంటి తారలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.