Plane crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం.. భారత్ కీలక ప్రకటన
అప్గానిస్థాన్‌లో ప్యాసింజర్ విమానం కూలిపోయింది. చైనా, తజికిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన స్థలం గురించి ఖచ్చితమైన సమాచారం తెలియదు. సంఘటనా స్థలానికి తాము బృందాలను పంపినట్లు ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జబిహుల్లా అమిరి తెలిపారు. బదక్షన్‌లోని పర్వత ప్రాంతంలో రాత్రిపూట ప్రమాదం జరిగినట్లు స్థానికులు తమకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రమాదం తీవ్రత.. ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని చెప్పారు. కూలిపోయిన విమానం భారత్‌కు చెందినదిగా ప్రచారం జరగ్గా.. ఇండియా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని పేర్కొంది. అది మొరాకో రిజిస్టర్డ్ విమానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది.