LOADING...
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 3.7 తీవ్రతతో భూకంపం.. నెల రోజుల్లో నాలుగు  భూకంప ప్రకంపనలు.. భయాందోళనల్లో జనం!
నెల రోజుల్లో నాలుగు  భూకంప ప్రకంపనలు.. భయాందోళనల్లో జనం!

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 3.7 తీవ్రతతో భూకంపం.. నెల రోజుల్లో నాలుగు  భూకంప ప్రకంపనలు.. భయాందోళనల్లో జనం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ను వణికిస్తున్నాయి.శుక్రవారం ఉదయం (అక్టోబర్ 24) భారత కాలమానం ప్రకారం ఉదయం 6.09 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపానికి కేంద్రబిందువు 36.38 ఉత్తర అక్షాంశం,71.14 తూర్పు రేఖాంశంలో,భూమికి 80 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గత కొన్ని రోజుల్లో వరుసగా ప్రకంపనలు నమోదవుతున్నాయి. అక్టోబర్ 21న 4.3 తీవ్రతతో, అక్టోబర్ 17న 5.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఈ నెలలో భూమి కంపించటం ఇది నాలుగోసారి. సాధారణంగా 3.7 తీవ్రత గల భూకంపాలు పెద్దగా నష్టం కలిగించవు.

వివరాలు 

అక్టోబర్ 17న 5.5 తీవ్రతతో  భూకంపం

ముఖ్యంగా ఇది 80 కిలోమీటర్ల లోతులో సంభవించినందున భూమి పైభాగానికి తక్కువ ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. గత అక్టోబర్ 17న జరిగిన 5.5 తీవ్రత భూకంపం మాత్రం 43 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల ఎక్కువగా అనుభవించారని పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతాలు భూకంపపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. భారత,యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతం కావడంతో ఇక్కడ తరచూ ప్రకంపనలు నమోదవుతున్నాయని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలి ఈ వరుస ప్రకంపనలు ఆ ప్రాంతంలో భూమి కదలికలు కొనసాగుతున్నాయని సూచిస్తున్నా, భారీ భూకంపం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చేసిన ట్వీట్