Semi Final Scenario: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. అయినా ఆఫ్ఘనిస్తాన్‌కి సెమీఫైనల్ అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ పూర్తిగా ముగియకపోవడంతో, రెండు జట్లకు చెరో పాయింట్ అందజేశారు.
ఈ ఒక పాయింట్‌తో ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే స్తితిలో ఉంది.
అయితే, కొంత సమీకరణం అనుకూలిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా సెమీ-ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బలమైన ప్రారంభాన్ని ఇచ్చింది.
12.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే, ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
Details
ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు
2009 తర్వాత తొలిసారి, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇక, ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లాండ్ మీద ఆధారపడింది.
ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం ఆధారంగా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఆధారపడింది.
Details
ఏం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుతుంది?
ప్రస్తుతం గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ మూడు పాయింట్లతో -0.990 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడు పాయింట్లతో +2.140 నెట్ రన్‌రేట్‌తో ముందంజలో ఉంది.
మార్చి 1న జరిగే ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ 207 పరుగుల తేడాతో గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించనుంది.
మరో ప్రత్యామ్నాయ సమీకరణలో, దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి, ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 11.1 ఓవర్లలో ఛేదిస్తే, ఆఫ్ఘనిస్తాన్‌కి అవకాశముంటుంది.
ఈ సమీకరణాలు మరీ క్లిష్టమైనవే అయినా, క్రికెట్‌లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది.