LOADING...
Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం.. సిస్మాలజీ కేంద్రం హెచ్చరిక జారీ
అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం.. సిస్మాలజీ కేంద్రం హెచ్చరిక జారీ

Earthquake: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం.. సిస్మాలజీ కేంద్రం హెచ్చరిక జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (National Centre for Seismology) తెలిపిన ప్రకారం, రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూమికి సుమారు 90 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. అయితే జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌(GFZ) ప్రకారం ఈ భూకంప తీవ్రత 6.07గా నమోదైందని, కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. భూకంప ప్రభావం దీవుల పలు ప్రాంతాల్లో స్పష్టంగా తెలిసినప్పటికీ, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు అందలేదు. అధికారులు భూకంపం ప్రభావం ఎంతమేరకు ఉందో అంచనా వేస్తున్నారు.