
Earthquake: థాయ్‌లాండ్‌లో భూకంపం కలకలం.. భారతీయుల కోసం అత్యవసర నంబర్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ లోని బ్యాంకాక్ సహా పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.
స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ, పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఏ భారతీయ పౌరుడికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని స్పష్టం చేసింది.
భద్రతా దృష్ట్యా, థాయ్‌లాండ్‌లోని భారతీయులకు హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. అత్యవసర పరిస్థితుల కోసం +66 618819218 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయీ నగరంలోని కాన్సులేట్ అధికారులు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేస్తూ, దీనికి సంబంధించి 'ఎక్స్'లో ఓ పోస్టు పెట్టింది.
Details
ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం
అదే సమయంలో మయన్మార్, థాయ్‌లాండ్‌లలో వరుస భూకంపాలు సంభవించడం తీవ్ర అనర్థాన్ని కలిగించింది.
తాజా సమాచారం మేరకు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్‌లో 55 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
థాయ్‌లాండ్‌లో నలుగురు మృతిచెందగా, 81 మంది గల్లంతయ్యారు
. అలాగే 50 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.