
Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
ఈ వార్తాకథనం ఏంటి
భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోగా, కష్టకాలంలో వారికి భారత్ సహాయహస్తం అందించింది.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, ఈ దేశాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆయన పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ తక్షణమే చర్యలు చేపట్టింది.
మోడీ ఆదేశాలతో దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని మయన్మార్‌కు రవాణా చేశారు.
భారత వాయుసేనకు చెందిన C130J ప్రత్యేక విమానం, హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Details
ఇప్పటివరకూ 1000 మంది మృతి
ఈ సహాయ సామగ్రిలో ఆహార పదార్థాలు, తాత్కాలిక నివాసానికి అవసరమైన టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలు ఉన్నాయి.
తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బాధితులకు వీటి ద్వారా తక్షణ సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపాల ధాటికి మయన్మార్, థాయిలాండ్ గజగజ వణికిపోయాయి. భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ టీమ్‌లు సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.