Page Loader
Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు 
గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు

Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రభావం టర్కీ, ఈజిప్ట్, సిరియా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. గ్రీస్‌లోని డోడెకనీస్ దీవులకు సమీపంగా, సుమారు 16 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రకంపనలు భూమి ఉపరితలం నుండి 68 కిలోమీటర్ల లోతులో (అంటే సుమారు 42 మైళ్లు) చోటు చేసుకున్నట్లు అంచనా వేయబడింది.

వివరాలు 

ప్రకంపనల ప్రభావంతో పలు నగరాలు, పట్టణాలు వణికిపోయాయి

అదే సమయంలో, యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈ సమయానుసారం తెల్లవారుజామున 3:17 గంటలకు టర్కీ నైరుతి భాగంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల ప్రభావంతో పలు నగరాలు, పట్టణాలు వణికిపోయాయి. ఇంట్లోని వస్తువులు కదిలిపోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫుటేజీలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు అధికారికంగా సమాచారం లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6.2 తీవ్రతతో భూకంపం