సిరియా: వార్తలు
21 Feb 2023
భూకంపంటర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి
టర్కీలోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 213 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని సులేమాన్ తెలిపారు.
18 Feb 2023
భూకంపంభూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు
టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
13 Feb 2023
టర్కీటర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య
టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.
11 Feb 2023
భూకంపంటర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.
10 Feb 2023
భూకంపంపేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు
సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..
10 Feb 2023
భూకంపంటర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు
సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.
09 Feb 2023
భూకంపంటర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు
టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
08 Feb 2023
టర్కీభూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు.
టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీటర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.
07 Feb 2023
భారతదేశంటర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.
07 Feb 2023
టర్కీటర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.