
Israel: సిరియా అధ్యక్ష భవనం సమీపంలో ఇజ్రాయెల్ సైనిక దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై కొనసాగించిన సైనిక చర్యల తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని సిరియాపై సారించింది.
తాజాగా, డమాస్కస్‌లో సిరియా అధ్యక్షుడి నివాసం సమీపంలో మెరుపుదాడిని చేపట్టి తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపింది.
ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా మధ్యప్రాచ్యంలో ప్రతీకార దాడుల వల్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
దాదాపు ఏడాదిన్నరగా ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి స్థిరపడడం అసాధ్యమైపోయింది.
వివరాలు
లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులే లక్ష్యంగా
ఇజ్రాయెల్ తరచూ గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని రాకెట్లు, మిస్సైళ్లతో దాడులు జరుపుతోంది.
ఈ దాడులలో ఆ గ్రూపులకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు, కమాండర్లు హతమయ్యారు.
వారిలో హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహీం వకీల్, అహ్మద్ వహ్బీ, హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమా వంటి ప్రముఖులు ఉన్నారు.
ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకోవడం కొత్త దిశగా మలుపు తిప్పిన పరిణామంగా మారింది.
వివరాలు
డ్రూజ్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించిన ఇజ్రాయెల్
డమాస్కస్‌లో అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ధృవీకరించారు.
ఈఉదయం విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని వివరించారు.
డ్రూజ్ కమ్యూనిటీ సభ్యుల రక్షణలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు.డ్రూజ్ సామాజిక వర్గం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో విస్తరించి ఉంది. వీరు చాలా ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా పని చేస్తారన్న అభిప్రాయం ఉంది.
గతేడాది డిసెంబర్‌లో,సున్నీ ఇస్లామిస్టులు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పై విరుచుకుపడి డ్రూజ్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.
అటువంటి చర్యలకు తగిన ప్రతిఫలం చెల్లించక తప్పదని అప్పుడే హెచ్చరించింది.
ఇప్పుడు ఆ హెచ్చరికల మేరకే చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.
వివరాలు
భారీ స్థాయిలో దాడులు-ప్రతిదాడులు
ఇజ్రాయెల్ వైమానిక దళాలు డమాస్కస్‌పై తీవ్రమైన బాంబుల దాడికి పాల్పడ్డాయి. సిరియా అధ్యక్షుడి భవనమే ఈ దాడిలో ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
ఇది జరిగే క్రమంలో, డ్రూజ్ కమ్యూనిటీకి చెందిన సెల్ఫ్ డిఫెన్స్ యూనిట్లు సున్నీ ఇస్లామిస్టులపై ఎదురు దాడులు చేపట్టాయి.
సహ్నాయా పట్టణంలో ఈ దాడులు-ప్రతిదాడులు భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దేశంలో అంతర్గత భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే శాఖ వెల్లడించింది.