Syria: తిరుగుబాటుదారుల చేతుల్లోకి డమాస్కస్.. పారిపోయిన సిరియా అధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంగా కొత్త మలుపు తీసుకుంటోంది.
తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ఇప్పుడు రాజధాని డమాస్కస్‌కు చేరుకున్నారు.
సిరియా ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో తిరుగుబాటుదారులు డమాస్కస్‌ను ఆక్రమించారు. 2018 తరువాత తిరుగుబాటుదారులు రాజధాని సమీపానికి చేరుకోవడం ఇదే తొలిసారి.
దీంతో, అధ్యక్షుడు బషర్ అల్-అసద్ రాజధాని డమాస్కస్‌ను విడిచి పారిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నాడో స్పష్టత లేదు, అయితే ఆయన రష్యాకు వెళ్లినట్లు సమాచారం.
ఉత్తర సిరియాలో హయాత్ తహరీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు మరింత ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ పట్ల వ్యతిరేకంగా మారుతోంది.
Details
తిరుగుబాటుదారుల కంట్రోల్‌లోకి వచ్చిన దారా, స్వీడియా
కీలకమైన నగరాలు దారా, స్వీడియా వంటి ప్రాంతాలు తిరుగుబాటుదారుల కంట్రోల్‌లోకి వచ్చాయి.
డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయ్‌లలో కూడా తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో తిరుగుబాటుదారుల ప్రవేశం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తమవుతున్నాయి.
తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో, డమాస్కస్‌లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
దారా నగరంలో 90 శాతం భూభాగం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో, అసద్ ప్రభుత్వం ఇంకా నిలబడేందుకు దారి లేకుండా పోయింది.